దుగ్గొండి మండలంలో గొర్రెల దొంగల హల్ చల్

# వరుస దొంగతనాలతో నర్సంపేట డివిజన్ ప్రజల్లో అలజడి.
# పోలీసులకు సవాల్ మారిన పశువుల దొంగతనాలు..


# నంబర్ లేని బ్లాక్ కారులో వచ్చి దొంగతనాలు చేస్తూ…
# బాధితుల పిర్యాదు,కేసు నమోదు చేసిన ఎస్సై పరమేష్..

నర్సంపేట,నేటిధాత్రి :

దుగ్గొండి మండలంలో గొర్రెలు,మేకల దొంగలు హల్ చల్ చేస్తున్నారు.
రోడ్ల పక్కన పాకల్లో నిద్రిస్తున్న గొర్లు,మేకలను అపహరించారు.ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని గోపాలపురం,దుగ్గొండి మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.దుగ్గొండి ఎస్సై పరమేష్ ,బాధితులు తెలిపిన దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన ఎలబోయిన బుచ్చయ్య అనే గొర్ల పెంపకం దారి తనకు ఉన్న గోర్లను నల్లబెల్లి దుగ్గొండి ప్రధాన రహదారి పక్కన గల ఇంటి ముందు పాకలో ఉంచాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నంబర్ లేని బ్లాక్ కలర్ కారులో తన ఇంటి వద్దకు వచ్చి గొర్లను అపహరించి కారులో వేసుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన హనుమాన్ దీక్ష మాల ధారణ స్వాములు స్నానానికి లేచారు.బుచ్చయ్య ఇంటివద్ద గుర్తు తెలియని వ్యక్తులు గొర్లను అపహరిస్తుండగ గమనించి వారు కేకలు వేయడంతో దుండగులు గొర్రెలను అక్కడే వదిలిపెట్టి వారు తెచ్చుకున్న బ్లాక్ కలర్ కారులో దుగ్గొండి వైపుకు పారిపోయారు.ఇదే క్రమంలో దుగ్గొండి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ పక్కన గల ఎలబోయిన రాజు అనే గొర్ల పెంపకందారుల ఇండ్ల వద్ద ఉన్న గొర్రెలు,మేకలను ఎత్తుకెళ్లారని బాధితుడు రాజు ఆరోపించారు.ఇంటి వద్ద గల గొర్లమంద వద్ద ఎవరు లేరని భావించిన గుర్తుతెలియని వ్యక్తులు గొర్లను అపహరించారని వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేష్ తెలిపారు.

# వరుస దొంగతనాలతో నర్సంపేట డివిజన్ ప్రజల్లో అలజడి…

నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా గొర్లు,మేకలు,పశువుల వరుస దొంగతనాలు జరుగడం వలన ప్రజల్లో అలజడి మొదలయ్యింది.గత నెల రోజుల ఇదే గొర్రెలు,మేకలను గుర్తుతెలియని వ్యక్తులు అదే బ్లాక్ కలర్ కారులో వచ్చి దొంగతనాలకు పాల్పడ్డారని దుగ్గొండి,నల్లబెల్లి ఈ రెండు మండలాల పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి.గత నెల 21 న అర్థరాత్రి దుగ్గొండి మండల కేంద్రంలోని సోనబోయిన కుమారస్వామి అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న గొర్లను ఇదే బ్లాక్ కలర్ కారులో వచ్చిన దుండగులు గొర్రెలను ఎత్తుపోయారని పిర్యాదులతో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అలాగే ఇటీవల నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వాపురం అర్ధరాత్రి పశువులను అపహరిస్తున్న మహిళా పట్టుపడగ బాధితులు పోలీసులకు అప్పజెప్పారు.ఈ సంఘటన జరిగి వారం రోజులు కాకముందే దుగ్గొండి మండలంలో మేకలు,గొర్రెలను అదే కారు బ్యాచ్ దొంగతనాలకు పాల్పడటం ప్రజల్లో గుబులుపుట్టిస్తుంది.

# పోలీసులకు సవాల్ మారిన పశువుల దొంగతనాలు…

గత నెల రోజులుగా నర్సంపేట డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో గొర్రెలు,మేకలు,అవులు అపహరణ కావడం ఇప్పటికే గత నెల రోజుల నుండి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు నమోదు అయ్యాయి.ఇప్పుడు మరల బ్లాక్ కలర్ కారులో గొర్రెలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేయడం అవి పోలీసులకు సవాల్ గా మారాయి.గొర్రెలు,మేకలను పశువులను అపహరుస్తున్న దుండగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డివిజన్ పరిధిలోని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *