సిరిసిల్ల జిల్లాలో షీ టీం అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే
మహిళలకు రక్షణగా షీ టీం
సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లాలో మహిళల, విద్యార్థుల రక్షణయే లక్ష్యంగా ఏర్పాటు చేసిన షీ టీం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళ చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పొక్సో, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, వేధింపులకు గురైతే ఎవరిని సంప్రదించాలి అనే మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తూ మహిళల,విద్యార్థినీల భద్రతకు భరోసా కల్పించడం జరుగుతుంది.గడిచిన నెల రోజుల వ్యవధిలో జిల్లాలో విద్యార్థినిలను, మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై 02 కేసులు, 07 పెట్టి కేసులు నమోదు చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే మాట్లాడుతూ..విద్యార్థినులు,
మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి షీ.టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు.