She Team Awareness Meet at Tejaswini College
తేజస్విని జూనియర్ కాలేజీలో షీ టీం అవగాహన సదస్సు
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే,
ఐపీఎస్ ఆదేశాల మేరకు, భూపాలపల్లి షీ టీం భరోసా సిబ్బంది సంయుక్తంగా తేజస్విని జూనియర్ కాలేజీలో విద్యార్థినుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ
మహిళలు, విద్యార్థులు ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే మౌనంగా ఉండకుండా వెంటనే షీ టీంను సంప్రదించాలని సూచించారు. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల పట్ల నమ్మకాన్ని ప్రదర్శించవద్దని సూచించారు.
అదేవిధంగా మానవ అక్రమ రవాణా, మహిళా భద్రత, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, సైబర్ సెక్యూరిటీ సేవలపై అవగాహన కల్పించారు.
ఎటువంటి ఆపద ఎదురైనా 1930 టోల్ ఫ్రీ నంబర్ లేదా షీ టీం వాట్సాప్ నంబర్ 8712658162 ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.
విద్యార్థులు చదువుతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్చుకోవడం అవసరం అని సూచించారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర, కానిస్టేబుల్ ఇర్ఫాన్, శ్రీనివాస్, మరియు భరోసా టీం భూపాలపల్లి సభ్యులు పాల్గొన్నారు.
