షర్మిల నోట రేటెంత దొంగరేవంత! షర్మిల పంచులు…రేవంత్‌ కు చుక్కలు.

https://epaper.netidhatri.com/

మద్దతిచ్చిన మరునాడే ఇజ్జత్‌ తీసిన షర్మిల!

`షర్మిల రాజకీయంలో ఆరితేరింది.

` రేవంత్‌ ను టార్గెట్‌ చేసింది.

`పోటీ కన్నా ఇలా పోటు మేలనుకున్నది.

` రేవంత్‌ ను మళ్లీ ఏకసింది.

`మీడియా సమావేశంలో దొంగ అన్నది.

`రేటెంత రెడ్డి అన్నది.

`దొంగను అధికారంలో కి రానివ్వనన్నది.

`రేవంత్‌ ముద్దాయి కాదని, నిందితుడే అని కోర్టు చెప్పిందని గుర్తు చేసింది.

`కాంగ్రెస్‌ లో చేరకుంటానే రేవంత్‌ కు వణుకు పుట్టించింది.

హైదరాబద్‌,నేటిధాత్రి:

ఆ వ్యాఖ్యలు నావి కావంటూనే అనాల్సిన మాటలన్నీ షర్మిల అనేసింది. చెప్పాల్సింది చెప్పేసింది. తన మనసులో వున్నది కక్కెసింది. రేవంత్‌ను ముఖ్యమంత్రి కానివ్వని తేల్చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రేవంత్‌రెడ్డి ఊహించిందే జరుగుతోంది. రేవంత్‌రెడ్డి భయపడిరదే కళ్లముందు కనిపిస్తోంది. షర్మిల వల్ల ఎప్పటికైనా ఇబ్బందే అనుకున్న రేవంత్‌కు మద్దతు పేరుతో చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. నిజానికి షర్మిల రేవంత్‌రెడ్డి మీద ఎప్పుడో ఆట మొదలుపెట్టింది. పార్టీ విలీనానికి రేవంత్‌రెడ్డి అడ్డుపుల్ల వేస్తాడని తెలిసే ఆ ప్రకటన చేసింది. రేవంత్‌ను సూటిగా టార్గెట్‌ చేసే అవకాశం పార్టీలో చేరితే వుండదనే, మద్దతు ముసుగులో ఏకి పారేస్తోంది. సీనియర్ల గొంతు షర్మిల నోట వినిపిస్తోంది. రేవంత్‌కు కునుకులేకుండా చేసే రాజకీయాలు మొదలుపెట్టింది… రేవంత్‌రెడ్డి కొడంగల్‌ ప్రచారంలో మీ బిడ్డ రేపటి రోజు నాయకుడు కానున్నాడంటూ ప్రకటించారు. ఆ వెంటనే షర్మిల మీడియా ముందుకు వచ్చింది. రేవంత్‌పై పరోక్ష వ్యాఖ్యలపేరుతో ప్రత్యక్షంగానే వ్యంగ్యాస్త్రాలు సందించింది. ఒక రకంగా రేవంత్‌ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ముఖ్యమంత్రిని కానివ్వనన్నంత మాట మాట్లాడిరది. ఏ పార్టీలోనైనా దొంగలు ముఖ్యమంత్రులు కావొద్దంటూనే రేవంత్‌కు చురకలు అంటించింది. తాను దొంగ అంటే మీడియానే రేవంత్‌రెడ్డిని ఉటంకించిందంటూ చెప్పింది. అంటే తన మనసులోని మాటలను మీడియా ద్వారా బైటపెట్టించింది. ఇక రేవంత్‌ ఓటుకు నోటు కేసు విషయంలో ముద్దాయి కాదని నిందితుడే అని ఆ మాట సాక్ష్యాత్తు సుప్రింకోర్టే చెప్పిందంటూ తేల్చేసింది. కాంగ్రెస్‌లో చేరిన ఆమె కాంగ్రెస్‌కు మేలు చేసేందుకు చేరిందా? లేక రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు చేరిందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నాడన్న ఆరోపణలకు షర్మిల వ్యాఖ్యలు బలం చేకూర్చేలా వున్నాయి. ఇతర రాజకీయ పార్టీలు రేవంత్‌రెడ్డిని రేటెంత రెడ్డి అని ముద్దుగా పిలిచాయంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. షర్మిల కాంగ్రెస్‌లో ఈ సమయంలో చేరి పార్టీని రెండుగా చీల్చే కుట్ర చేస్తుందా? అన్నది కూడా చర్చ సాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్‌లో ఇప్పుడున్న వర్గాలు రెండు. ఒకటి రేవంత్‌రెడ్డి వర్గం. రెండోది సీనియర్ల వర్గం. సీనియర్లు ఎవరూ రేవంత్‌రెడ్డికి మద్దతు పలకకపోవచ్చు. ఇది ముందే గమనించిన రేవంత్‌రెడ్డి ఎక్కడికక్కడ తన కంటూ ఓ వర్గం వుండాలని ముందునుంచే ప్రణాళికలు రచించారు. తెలుగుదేశం పార్టీని ఒక రకంగా కాంగ్రెస్‌లో నింపేశారు. ఆకు పచ్చ కాంగ్రెస్‌కు మొత్తానికి పచ్చ రంగు పులిమేశారు. ఎలాంటి ఉప ద్రవం వచ్చినా తన వర్గం స్ట్రాంగ్‌గా వుండేలా రేవంత్‌ పునాదులు గట్టినానే వేసుకున్నాడు. కాంగ్రెస్‌లో వున్నది ఈ రెండు వర్గాలన్నది కూడా భహిరంగ రహస్యమే. కాకపోతే షర్మిల మద్దతు వల్ల భవిష్యత్తులో ఆమెకు పార్టీలో ఎంతో ప్రాధాన్యత వుండొచ్చన్నది కూడా తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు ఎలాగూ షర్మిలకు పూర్తి మద్దతు పలుకుతారు. ఖమ్మం జిల్లాకు చెందని పొంగులేటి కూడా షర్మిల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అటు కోమటిరెడ్డి, ఇటు పొంగులేటిలు భవిష్యత్తులో కాంగ్రెస్‌ను శాసించేందుకు షర్మిల రాజకీయం కూడా ఎంతో ఉపయోగపడొచ్చు. అందుకు షర్మిల తనదైన శైలిలో రాజకీయం మొదలుపెట్టినట్లు వుంది. తెలంగాణలో గత రెండున్నరేళ్ల క్రితం పార్టీ పెట్టి, 3800 రోజులు పాదయాత్ర చేపట్టి, తెలంగాణ మొత్తం పోటీచేస్తామని చెప్పిన షర్మిల తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కాంగ్రెస్‌కు కలిసొస్తుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎందుకంటే గత రెండు నెలల క్రితం కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ఆర్టీపి విలీన ప్రక్రియ మొదలౌతుందని ప్రకటించారు. తర్వాత మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారు. తెలంగాణలో వైఎస్‌ఆర్టీపి అన్ని స్దానాలకు పోటీ చేస్తుందని షర్మిల ప్రకటించింది. 119 స్ధానాల్లో అభ్యర్దులు ధరఖాస్తు చేసుకోవాలని సూచించింది..తీరా నామినేషన్ల గడువు దగ్గరకు రాగానే చేతులెత్తేసింది. చేయి గుర్తుకు మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించింది. ఆమెను నమ్ముకున్న ఎంత మంది రాజకీయ జీవితం చిదిమేసింది. వైఎస్‌ వున్నంత కాలం తెలంగాణ సమాజాన్ని వంచించాడు. ఆ రూపంలో వచ్చిన షర్మిల ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది. తన స్వార్ధ రాజకీయాల కోసం తెలంగాణలోని ఎంతో మందిని నాయకులను చేస్తానని, నమ్మించి మోసం చేసింది.

రాజకీయంగా ఏదో ఒక వేదిక కోసం ఎదురుచూస్తున్నఎంతో మంది షర్మిలను నమ్మి ఆ పార్టీలో చేరారు.
రెండున్నర సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసుకున్నారు. పార్టీ కోసం సర్వస్వం దారపోశారు. ఆస్థులు అమ్ముకొని మరీ షర్మిల రాజకీయం కోసంపనిచేశారు. కాని గత రెండు నెలల క్రితం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి ఆ పార్టీలో వున్నవారందరినీ మోసం చేసింది. దాంతో పార్టీలో వున్న కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న లాంటి వారిని కూడా ఎంతో అలవోకగా నమ్మించి మోసం చేసింది. కాని రాజకీయం తిరగబడిరది. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేస్తున్నామంటూ మళ్లీ ప్రకటన చేసింది. మళ్లీ ఎంతో మంది ఆశవహులు ఎన్నికల కోసం సిద్దమాయ్యరు. ఈ క్రమంలో ఎంతో ఖర్చు చేసుకున్నారు. కాని షర్మిల తాను కాంగ్రెస్‌ పార్టీకి సపోర్టు చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి వారిని నివ్వెరపోయేలా చేసింది. ఆమెను నమ్ముకున్న వారందరినీ నట్టెట్లో ముంచింది. ఒకనాడు కాంగ్రెస్‌ పార్టీని షర్మిల ఎంత తూర్పారపట్టాలో అంత పట్టింది. తన తండ్రి వైఎస్‌ మరణానికి కారణం కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేసింది. తన తండ్రి లేకుంటే కాంగ్రెస్‌పార్టీయే లేదన్నారు. తన అన్న జగన్‌ జీవితం జైలు పాలు కావడం కాంగ్రెస్‌ చేసిన పాపమన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ జపం చేస్తున్నారు.
షర్మిల తెలంగాణలో అడుగుపెట్టిన నాడు రేవంత్‌రెడ్డిని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టింది.
రేవంత్‌ పాదయాత్రను ఎగతాలి చేసింది. రేవంత్‌ యాత్ర పాదాల మీద సాగడం లేదన్నారు. ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డితో కూడా కలిసి పనిచేసేందుకు కూడా సిద్దమని ప్రకటించారు. కారణం బిఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటు చీలకూడదన్న భావన మాత్రమే వుందని షర్మిల చెప్పారు. పైగా తెలంగాణ ప్రజల కోసం తన రాజకీయం త్యాగం చేస్తున్నానంటూ పెద్దపెద్ద మాటలు చెప్పారు. ఇది తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్దంగా వున్నారా? అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం వుంది. అసలు ఒక దశలో రేవంత్‌రెడ్డిని అనేక మార్లు షర్మిల విమర్శలు చేసింది. రేవంత్‌ రెడ్డి కూడా షర్మిల రాకను ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాలతో ఆమెకు ఏం సంబంధం అని నిలదీశాడు. ఇప్పుడు షర్మిల పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు సపోర్టు చేయడాన్ని రేవంత్‌రెడ్డి స్వాగతించారు. కాని షర్మిల రాజకీయం వెనక ఏదో పెద్ద మతలబు వుందనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. షర్మిల తెలంగాణ రాజకీయం వెనకు కేవిపి. రామచంద్రరావు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికే.శిమకుమార్‌ వున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డి ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్న ఆయన వ్యతిరేక వర్గమంతా షర్మిల కాంగ్రెస్‌లోకి రావాలని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు ఆమె రావడం వల్ల తెలంగాణలో మరోసారి కేసిఆర్‌ సెంటిమెంటు రగిలించే అవకాశం వుంది.

అందుకే ఇప్పుడు కేవలం మద్దతు వరకు మాత్రమే ప్రకటన చేసేలా ఎత్తుగడలు వేశారు. ఎన్నికల్లో ఒక వేళ కాంగ్రెస్‌ గెలిస్తే షర్మిలకు సముచితమైన స్ధానం కల్పిస్తామని అదినాయకత్వం కూడా హమీ ఇచ్చినట్లు సమాచారం.
షర్మిల వెనక కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సిఎల్సీ నాయకుడు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లాంటి వారున్నారు.
వీరంతా ఎన్నికల ఫలితాల తర్వాత ఏకమైన రేవంత్‌ రెడ్డిని ఏకాకిని చేయాలని చూస్తున్నారు. ఇది పసిగట్టిన రేవంత్‌రెడ్డి ముందే కాంగ్రెస్‌లో తెలుగుదేశం శ్రేణులను నింపేశారు. వారికి టిక్కెట్లు కూడా ఇప్పించుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్‌లో రెండు వర్గాలు ఏర్పాటైనట్లే అన్నది అందరూ చెప్పుకుంటున్న మాట. ఇదిలా వుంటే హైదరాబాద్‌ లో వున్న 24 అసెంబ్లీ స్ధానాలలో తమ ప్రభావం వుంటుందని కమ్మ సామాజిక వర్గమంతా తెలుగుదేశం పార్టీ వైపే వుంటుందని, అది తెలంగాణలో కాంగ్రెస్‌కు సపోర్టు చేస్తుందని అమరావతి పరిరక్షణ సమితి నాయకుడు కొలికపూడు శ్రీనివాస్‌ ప్రకటించడం జరిగింది. ఇక జనసమితిని కూడా ఆసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా , కాంగ్రెస్‌కు సపోర్టు చేయించడంంలో కూడా రేవంత్‌రెడ్డి కృతకృతులయ్యారు. ఇలా రాజకీయ పార్టీలను ఏకం చేసి,కాంగ్రెస్‌ భవిష్యత్తుకోసం రేవంత్‌రెడ్డి బాగానే కృషి చేస్తున్నారు. అన్ని కుదిరి ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వదించి గెలిపిస్తే ఎవరు ముఖ్యమంత్రి అన్నది కూడా ఇప్పటి నుంచే చర్చలో వుంది. ఇంత కష్టపడ్డ రేవంత్‌ను కాదని మరొకరిని ఎలా చేస్తారు? అని ప్రశ్నించేవాళ్లు కూడా వున్నారు. అయితే రేవంత్‌కు చెక్‌ పెట్టాలంటే షర్మిలను తెలంగాణ కాంగ్రెస్‌లో క్రియాశీలకం చేసి, ఆమె మద్దతు తెలిపేవారికే ముఖ్యమంత్రి పదవి ఇవ్చొచ్చన్న వార్తలు కూడా ఇప్పుడే వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!