టీ గ్లాస్ లతో సమగ్ర శిక్షా’ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన
భూపాలపల్లి నేటిధాత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాయ్ తాగి తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్షా కాంట్రాక్టు
ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీ కప్పులతో నిరసన తెలిపారు. సోమవారం 3వ రోజు నిరసన దీక్షలు కొనసాగాయి. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్,ఉపాధ్యక్షులు చిట్యాల శ్రీనివాస్, డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ దీక్షలకు సంఘీభావం తెలిపి, మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లుగా శ్రమదోపికి గురైన సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీక
రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘము రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కంకల రాజయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎం.డీ చాంద్ పాషా, తోకల వేణు, మహిళా అధ్యక్షురాలు చల్ల సునీత మాట్లాడుతూ గత ఏడాది వరంగల్లో చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనకు అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించారని గుర్తుచేశారు. టీ తాగే సమయంలో తమ సమస్యలు పరిష్కరించవచ్చని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. గత 18 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. .ఈ అసెంబ్లీ సమావేశాల్లోపు తమ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. అందరికీ జీవిత, ఆరోగ్య బీమా సదుపాయాలు కల్పించాలన్నారు. ఉద్యోగ విరమణ చేసేవారికి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘము భాద్యులు మారం మహేందర్ రెడ్డి, సుదర్శన్, హేమ, నరేష్ కుమార్, రాజు, తిరుపతి, మల్లికార్జున్, శ్రీనివాస్, హరీష్, కుమార్, శశికల, శ్రీవాణి, సృజన తదితరులు పాల్గొన్నారు.