
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి
అడ్డగూడూరు మండల పరిషత్ అభివృద్ధి (ఎంపీడీవో) గా బుధవారం పి. శంకరయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవో గా పని చేసిన ఎల్ చంద్రమౌళి నల్లగొండ జిల్లాకు బదిలీ అయ్యారు. సూర్యాపేట జిల్లా , నేరడుచర్ల మండలం ఎంపీడీవో గా పనిచేసి ఇక్కడకు శంకరయ్య వచ్చారు. మండల పరిషత్ పరిధిలోని అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ, మండల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.