
Shami daughter birthday
అప్పుడే ఎంత ఎదిగావు తల్లీ
కూతురు ఐరా 10వ పుట్టిన రోజును పురస్కరించుకొని టీమిండియా పేసర్ మహ్మద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. షమి-హసీన్ జంట మనస్పర్థల కారణంగా…
న్యూఢిల్లీ: కూతురు ఐరా 10వ పుట్టిన రోజును పురస్కరించుకొని టీమిండియా పేసర్ మహ్మద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. షమి-హసీన్ జంట మనస్పర్థల కారణంగా 2018లో విడిపోయినప్పటినుంచి ఐరా తల్లి వద్ద ఉంటోంది. ‘నువ్వు ఇంత త్వరగా ఎదిగావంటే నమ్మలేకపోతున్నా. జీవితంలో నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. భగవంతుడు నీకు ప్రేమ, ఆనందం, ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఐరాతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నాడు.