ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మంగళవారం రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ..
శక్తి వందన్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా ఈ నెల 10 నుండి25 తేదీ వరకు మహిళా స్వయం సహాయక స్వచ్ఛంద సంస్థలను చేరుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మహిళలకు స్వయం స్వచ్ఛంద సహకారాలు వివరించాలని అన్నారు..
శక్తివంతమైన అభియాన్ కార్యక్రమానికి జిల్లా కమిటీలు,మండల కమిటీలు, పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు..
కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు కోట్ల పైగా ఆవాస్ యోజన కింద మంజూరు చేశారని అన్నారు..
మహిళలకు ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా 10 కోట్ల పైగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని చట్టసభలో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు..
ఈనెల 25వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించే మహిళా సమ్మేళనం లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ లో పాల్గొంటారని అన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డికె. స్నిగ్దా రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, అసెంబ్లీ పోటీ చేసిన అభ్యర్థి బలిగేర శివారెడ్డి,జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు క్రిష్ణ వేణి,పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు,రాష్ట్ర మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి శ్రీను, జిల్లా మహిళ కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొన్నారు