
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఎస్జిఎఫ్ క్రీడలు11, 12 తేదీలలో నిర్వహించడం జరిగాయని ఈపోటీలలో 14సం.ల లోపల మరియు 17సం.ల లోపల బాలబాలికలు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలలో దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారని, ఈపోటీలలో పాల్గొన్న బాలబాలికల నుండి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ప్రతి ఆట నుండి పన్నెండు మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని మరియు వారిలో ఈవెంట్ కు ఇద్దరు చొప్పున ఎంపిక చేయడం జరుగుతుందని మండల విద్యాధికారి అంబటి వేణు కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నం రమేష్, మండల ఎస్జిఎఫ్ సెక్రెటరీ దత్తాత్రేయ శర్మ, పీడీలు వీరు పాల్ రెడ్డి, రూపారాణి, ఐజాజ్ అహ్మద్, పీఈటి వెంకటలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.