ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5 వ మహాసభలు విజయవంతం చేయండి
గోడ పత్రిక ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ అన్నారు. గురువారం రోజున జిల్లా కేంద్రంలో రాష్ట్రమహాసభల వాల్ పోస్టర్స్ జిల్లా కమిటీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు ఈనెల ఏప్రిల్ 25 ,26, 27 ,తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంనర అవుతున్న కూడా విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు పెండింగ్లో ఉన్న దాదాపు 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్లో ఉన్నాయి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్య సంస్థలలో చదువుకునే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక సతమతమవుతున్నారన్నారు రాష్ట్రానికి ఇప్పుటీ వరకు విద్యశాఖ మంత్రి లేరన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని తెలిపారు .
ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధావులతో చర్చించి రాబోవు భవిష్యత్తు కార్యాచరణలను ఎజెండాలను ఎంచుకొని భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలు చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు.ఈమహాసభలకు విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సామల్ల సాయి భరత్, కడారీ శివ, నాయకులు శ్రీధర్, రాబిన్సన్, సాయి, చరణ్,అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.