
Education Minister
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలు ,జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం
విద్యా శాఖ మంత్రిని వెంటనే కేటాయించాలి
పెండింగ్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్,మల్లారపు ప్రశాంత్
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ ) ఆధ్వర్యంలో విద్యా రంగంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతం అయ్యిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలనీ,ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకుని రావాలనీ,ఖాళీగా ఉన్న టీచర్, ఎంఇఓ, డిఇఓ, మరియు లెక్చరర్స్,ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ చేయాలనీ,అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల, హస్టల్స్ భవనాలుకు స్వంత భవనాలు నిర్మించాలి.గురుకులాల సమయాన్ని శాస్ర్తీయంగా మార్చాలనీ,NEP -2020 రద్దు చేసి, తెలంగాణ అసెంబ్లీలో అమలు చేయకుండా తీర్మానం చేయాలనీ,పెండింగ్ స్కాలర్ షిప్స్ ,ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలనీ,పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలనీ,బడ్జెట్, చిన్న ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి.ఆర్ధిక సహాకారం అందించాలనీ విద్యాసంస్థల సమయానికి అనుగుణంగా అన్ని గ్రామాల నుండి బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలనీ అన్నారు.జిల్లాలో నిర్వహించిన బంద్ లో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జశ్వంత్, ఉస్మాన్, షాహిద్, యశ్వంత్, సిద్దు, సాయి, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.