పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బాలికల ప్రభుత్వ పాఠశాలలో మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.అనంతరం విద్యార్థుల తో కలిసి సహవాస భోజనం చేసారు.ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కనీసం త్రాగునీరు లేని పరిస్థితి లేదన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివె విద్యార్థులకు కనీసం వసతులు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.ఇప్పటికైన ప్రజా ప్రతినిధులు,రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాలలో నెలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలన్నారు.లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎస్ఎఫ్ ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.