బిఆర్ఎస్ పార్టీ లో పలువురి చేరిక..
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని కమలాపురంకు చెందిన బీజేపీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గుడెపు రంజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దికుంట్ల సోమన్నలు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో ఒడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, కమలాపురం, ముతోజిపేట బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రవీణ్, బూర సుమన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
