అందరి సహకారంతో కన్నుల పండుగగా సేవాలాల్ మహారాజ జయంతి
◆-: నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా నియమకమైన చవాన్ రవీందర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్. గిరిజనుల ఆరాధ్య దైవం అయిన శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవం వచ్చే నెల 15 వ తేదీన జరగనుంది. నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన గిరిజన యువకులు పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనిలో గల బంజారా భవన్ లో మోతీరం రాథోడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక సమావేశంలో రాబోయే సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవలని తీర్మాణిస్తూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా శేకపూర్ తండాకు చెందిన రవీందర్ చవాన్ ను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో పాటు ప్రధాన కార్యదర్శిగా సజ్జరావు పెట్ తండాకు చెందిన రఘునాథ్ రాథోడ్, జహీరాబాద్ పట్టణ అధ్యక్షులుగా రవీందర్ రాథోడ్, కార్యదర్శులు రాథోడ్ వినోద్ సర్పంచ్, కిషన్ భానోత్ మాజి సర్పంచ్, కోశాధికారిగా నరేష్ చవాన్ ను నియమించినట్టు బంజారా భవన్ చైర్మన్ మోతీరం తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవీందర్ చవాన్ మాట్లాడుతూ నాపై విష్వసం ఉంచి అవకాశం కల్పించిన 54 తాండ వాసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నని, అందరి సహకారంతో సేవాలాల్ జయంతి అట్టహాసంగా నిర్వహించుకుంటామని అన్నారు.
