జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి…
మిర్చి క్వింటాల్ కి రూ” ఇరువై వేలు కనీస మద్దతు ధర ప్రకటించండి…
త్వరలో మిర్చి రైతుల సమస్యలపై గవర్నర్ సీయం మరియు రాష్ట్ర కేంద్ర మంత్రులను కలుస్తా…
*జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…
మంగపేట:నేటిధాత్రి
దేశవ్యాప్తంగా మిర్చి రైతులను ఆదుకునేందుకు “జాతీయ మిర్చి బోర్డు” ఏర్పాటు చేసి క్వింటాల్ ఎండు మిర్చి రూ” ఇరువై వేలు కనీస మద్దతు ధర నిర్ణయించి నేరుగా రైతుల వద్ద నుండి ప్రభుత్వమే మిర్చి కొనుగోలు చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడచిన పది రోజులుగా మిర్చి ధర భారీగా పతనం కావడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో మిర్చి రైతుల సమస్యలు తెలుసుకుని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు స్పైసెస్ బోర్డు అధికారులతో మాట్లాడానని ప్రస్తుతం మార్చి మాసంలో మిర్చి ధర పెరగవచ్చునని కేంద్ర వాణిజ్య శాఖ అంచనా వేస్తోందన్నారు ఎకరా మిర్చి సాగుకు సుమారు రూ” మూడు లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతుందని మార్కెట్లో క్వింటాలుకు పధమూడు వేల లోపు మాత్రమే ధర లభించడం వల్ల ఆర్థికంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో మిర్చిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నందున కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన జాతీయ పసుపు బోర్డు తరహాలో వరంగల్ కేంద్రంగా “జాతీయ మిర్చి బోర్డు” మంజూరు చేయాలని మిర్చి బోర్డు ద్వారా మిర్చి సాగు కి అవసరమైన అనేక రకాల రాయితీ పథకాలను అమలు చేయడంతో పాటు క్వింటాల్ ఎండుమిర్చి రూ” ఇరువై వేలు గా నిర్ణయించి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా నేరుగా ప్రభుత్వమే మిర్చి బోర్డు నుండి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సాంబశివరెడ్డి కోరారు ప్రస్తుత సీజన్ లో మార్కెట్ పరంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్ మరియు రాష్ట్ర కేంద్ర మంత్రులను కలిసి వారి దృష్టికి తీసుకు వెళ్తానని సాంబశివరెడ్డి తెలిపారు మిర్చి రైతుల సమస్యలు మార్కెట్ ఒడిదుడుకులపై ఇప్పటికే జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మూడు పర్యాయాలు తన నివేదికను భారత ప్రభుత్వం కామర్స్ మరియు ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు అందజేసిన విషయాన్ని సాంబశివరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు