Hope Foundation Launches Summer Relief Camp
కుట్రలతో సేవా కార్యక్రమాలను ఆపలేరు: హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్
నల్లగండ్ల చౌరస్తాలో చలివేంద్రం ప్రారంభం
బాటసారులకు మజ్జిగ పంపిణీ చేసిన హోప్ సభ్యులు
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
తనపై ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సేవా కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల చౌరస్తాలో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారులకు, బాటసారులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో తనకు పెరుగుతున్న ఆదరణను చూసి సహించలేక కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి కుట్రల వల్ల తన సేవా సంకల్పం మరింత బలపడుతుందే తప్ప వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని ఆయన ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికంగా మంచి నీళ్లు తాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శేఖర్, మల్లేష్, మారం ప్రసాద్, షర్ఫుద్దీన్ మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
