Service is My Goal
సేవే నా లక్ష్యం…
– అందరి సహకారంతో ముందుకు
– కాంగ్రెస్ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాష్ట్ర వైద్య–ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారి సహకారంతో, గ్రామస్తులందరినీ కలుపుకొని సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తానని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
గ్రామాభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలతో పని చేస్తూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గ్రామ అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున, ప్రభుత్వం పెద్దల సహకారంతో మరిన్ని పథకాలు, నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.
గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతానని, సేవ చేసే అవకాశం మరోసారి ఇవ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
