చిట్యాల, నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ గ్రామానికి అభివృద్ధి పనుల శంకుస్థాపనలో భాగంగా శనివారం రోజున గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి దాదాపు పది లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు, అనంతరం మహిళా సమైక్య సభ్యులు ఐకెపి సెర్ప్ సిబ్బంది శాలువాతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల సమావేశాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఎమ్మెల్యే నిధుల నుంచి దాదాపు పది లక్షల రూపాయలతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో ఏపీఎం మంజుల, సిసి రమణా దేవి, వీవోఏలు సంధ్య, కోమల, నలిన, మరియు గ్రామైక్య సంఘ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.