జైపూర్, నేటి ధాత్రి:
రాబోయే ఎన్నికల నేపథ్యంలో రామగుండము కమీషనర్ రేట్ పరిదిలోని మంచిర్యాల జిల్లా, జైపూర్ సబ్ డివిషన్, చెన్నూర్ రూరల్ సర్కిల్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిది లోని అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును మరియు మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో ఒకటైన అన్నారం గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ ఐపిఎస్., జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు మరియు చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్ తో కలిసి సందర్శించారు.ఎన్నికల నేపథ్యంలో అసాంఘిక కార్యకలపాలకు తావివ్వకుండా ముందస్తూ చర్యలలో భాగంగా సిర్వంచ నుండి అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ మీదుగా రాకపోకలను సాగిస్తున్న వాహనలను,చెన్నూర్ ప్రాంతం నుండి వస్తున్న వాహనలను నిలిపి, అనుమానితులను ప్రశ్నించారు. వాహనాలను పోలీసు అధికారుల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈసందర్బంగా డీసీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు,రాష్ట్రాల మధ్య అక్రమ రవాణా జరగకుండా అడ్డుకోవడానికి, చెక్ పోస్ట్ లు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. మంచిర్యాల జోన్ చెక్ పోస్ట్ లలో సాయుధ బలగాలతో కూడిన పహారాతో పకడ్బందీగా భద్రత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజలను ప్రలోభ పెట్టే వస్తువులను రాకుండా వివిధ శాఖల సమన్వయంతో, పర్యవేక్షణలో చెక్ పోస్ట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగింది. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునెల తగిన బందోబస్తు చర్యలను తీసుకోనున్నట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది విసిబుల్ గా ఉంటూ పోలింగ్ కేంద్రాలను నిరంతరం సందర్శిస్తూ అక్కడి ప్రజలకు ప్రశాంత వాతావరణంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎటువంటి గొడవలు లేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించేలా తోడ్పాటు అందించాలని అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్, జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.