`కాంగ్రెస్ లో సీనియర్ నాయకుల వింత ధోరణి!
`అదినుంచి అంతే.. పార్టీలో పెద్దలుగా పాతుకుపోయారంతే.
`అధికారం లేనప్పుడు పార్టీ పదవులన్నీ మాకే కావాలంటారు.
`అధికారం లోకి వస్తే ప్రభుత్వంలో మేమే ఉంటామంటారు.
`కొత్త వారు ఎదుగుతుంటే చూడలేరు.
`వారి వారసత్వలకు దారులు వేస్తుంటారు.
`గత 50 ఏళ్లుగా పదవులను అనుభవిస్తూనే వున్నారు.
`గోడలు దుంకి పోయి మళ్ళీ చేరి పెత్తనం చేస్తున్న వాళ్ళున్నారు.
`పార్టీ ని బలోపేతం చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి మీద అబండాలు వేస్తున్నారు.
`పార్టీ కి తీరని అన్యాయం చేస్తున్నారు.
`40 సంవత్సరాలు జీవన్ రెడ్డికి అన్ని అవకాశాలు ఇచ్చారు.
`రెండు సార్లు ఓడిపోయి కూడా పెత్తనం నాకే అన్నాడు.
`తన కూతురు రాజకీయం కోసం పార్టీ ని ఇబ్బంది పెట్టారు.
`కొత్త నాయకత్వం జగిత్యాల లో ఎదగకుండా చేశారు.
`ద్వితీయి శ్రేణులను చెప్పు చేతుల్లో పెట్టున్నాడు.
`ఇలా పార్టీ ప్రయోజనం కన్నా సొంత ప్రయోజనం పొందారు.
`పార్టీ కి 40 ఏళ్ళు సేవ చేశానని గొప్పలు చెప్పుకున్నాడు.
`పార్టీ బుజ్జగించినా లెక్క చేయలేదు.
`పార్టీ లోనే వుండి సిఎం రేవంత్ రెడ్డి మీద పదే పదే ఆరోపణలు చేశారు.
`ఇంత కాలం రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీ మీద అబండాలు వేస్తున్నాడు.
`రాజీనామా చేసి గొప్ప పని చేసినట్లు చెప్పుకుంటున్నాడు.
హైదరాబాద్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎంత నష్టమో తాజాగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని చూస్తే అర్దమౌతుంది. చెప్ప్పులోని రాయి, చెవిలోని జోరిగ అన్నట్లు నిత్యం పార్టీని తూర్పార పట్టే వాళ్ల వళ్ల నష్టమే గాని, లాభం వుండదు. కేవలం సీనియర్లయినంత మాత్రాన అడిగిన పదవి ఇవ్వాలి. తమకే ప్రాదాన్యత పదే పదే దక్కాలని కోరుకోవడం కూడా సరైంది కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చి, రేవంత్సర్కారు ఏర్పడిన నాటి నుంచి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిత్యం ఏదో కుంపటి రగిల్చుతూనే వస్తున్నారు. అయినా సిఎం. రేవంత్ రెడ్డి ఉపేక్షిస్తూ పోతున్నారు. జీవన్‌రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా సమాదానం చెప్పకుండా ఆయనపై వున్న గౌరవాన్ని నిలుకుంటూనే వున్నారు. ఆ మాత్రం కూడా అర్దం చేసుకోకుండా జీవన్‌రెడ్డి పదే పదే పార్టీని, ప్రభుత్వాన్ని తప్ప్పు పడుతూ వస్తునే వున్నారు. నిజం చెప్పాలంటే జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే పుట్టిన నాయకుడు కాదు. కాంగ్రెస్‌లోనే రాజకీయం మొదలు పెట్టిన నాయకుడు కాదు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన అన్యాయం జరిగింది ఏనాడు లేదు. ఇప్పటి వరకు ఆయన పార్టీ టికెట్ ఇవ్వకుండా వున్నది లేదు. గత ఎన్నికల్లో కూడా ఆయనకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సిఎం. రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో జగిత్యాలకు వెళ్లి స్వయంగా ప్రచారం నిర్వహించారు. జీవన్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. జీవన్‌రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. అయినా జీవన్‌రెడ్డి గెలవలేవు. నిజంగా జీవన్‌రెడ్డి అంత బలవంతుడే అయితే వరసగా రెండు సార్లు ఓ{మి పాలయ్యారు. 2018, 2023లోనూ ఓడిపోయారు. 2018లో ఓడిపోయినా మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిపించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఆయనను గౌరవించింది. తర్వాత మళ్లీ ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీగా వున్న జీవన్‌రెడ్డికే పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ ఎంతో ప్రచారం చేసింది. నాయకులు, కార్యకర్తలు విసతంగా ప్రచారం చేశారు. సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌రెడ్డి కూడా ప్రచారం నిర్వహించారు. ఇంత చేసినా జీవన్‌రెడ్డి ఓటమి పాýయ్యారు. ఇవే నాకు ఆఖరు ఎన్నిÅ£లు, మళ్లీ నేను ఎన్నికల్లో పోటీ చేయను అని కూడా జీవన్‌రెడ్డి సెంటి మెంటు ప్రయోగించారు. అయినా జగిత్యాల ప్రజలు కనికరించలేదు. జీవన్‌రెడ్డిని గెలిపించలేదు. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికý అభ్యర్దుల విషయంలోనూ జీవన్‌రెడ్డినే ముందు సిఎం. రేవంత్ రెడ్డి సంప్రదించారు. తనకు వద్దని జీవన్‌రెడ్డి చెబితేనే ఆల్ఫోర్స్ అధినేతకు ఆ సీటు కేటాయించారు. ఇలా పార్టీ అనేక సార్లు, అనేక అవకాశాలు ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవన్‌రెడ్డికి ఇచ్చినన్ని సార్లు అవకాశాలు సీనియర్ నేతల్లో ఏ ఒక్కరికీ దక్కలేదు. ఇప్పటి వరకు జీవన్‌రెడ్డికి పార్టీ 12 సార్లు బిఫామ్‌లు ఇచ్చింది. అందులో ఆరు సార్లు గెలిచారు. ఆరు సార్లు ఓడిపోయారు. అయినా పార్టీ ఆయనను గౌరవిస్తూనే వుంది. కాంగ్రెస్ పార్టీ గాలిలో గెలిచిన ప్రతీసారి జీవన్‌రెడ్డికి మంత్రి పదవి కూడా ఇస్తూ వచ్చారు. పైగా తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న తరుణంలో జీవన్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు. కేసిఆర్ కరీంనగర్లో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లినప్ప్పుడు కాంగ్రెస్ అభ్యర్దిగా పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. నాడు వైఎస్ చెప్పినట్లు చేశాడు. తెలంగాణ వ్యతిరేక శక్తులతోనూ చేతులు కలిపారు. ఇప్ప్పుడు నీతి సుద్దులు చెబుతున్నారు. తనకు అన్యాయం జరిగిందని మొత్తుకున్నారు. ఆఖరుకు పార్టీ కి చెందిన పెద్దలంతా కలిసి వచ్చి బుజ్జగించినా సరే వీరయోధుడులాగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తెలంగాణ వాదం లేదని నిరూపించాలని చూసిన జీవన్‌రెడ్డిని ఆనాడు తెలంగాణ సమాజమంతా చీ కొట్టింది. ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా వెళ్లొద్దని సూచించింది. అయినా ఆయన ఆగలేదు. తెలంగాణ 2009 ప్రకటన వచ్చిన తర్వాత కూడా జీవన్‌రెడ్డి జై తెలంగాణ అన్న సందర్భాలు లేదు. మంత్రి పదవి వుంటే చాలు అనుకున్నారు. మంత్రి పదవిని త్యాగం చేసేందుకు కూడా ఇష్టపడలేదు. ఉమ్మడి కరీంనగర్ అంతా జై తెలంగాణ నినదిస్తుంటే కళ్లుండి చూడలేదు. చెవులుండి వినలేదు. తెలంగాణ ఉద్యమానికి సహకరించలేదు. ఆనాడు సీమాంద్రులంతా ఒక్కతాటి మీదకు వచ్చి, సమైక్య వాదం వినిపిస్తుంటే కూడా వారిని వారించలేదు. జై తెలంగాణ అని గొంతు సవరించుకోలేదు. నాడైనా, నేడైనా సరే ఆయన పదవి కోసమే రాజకీయాలు ఆది నుంచి చేస్తూనే వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి గెలిచిన జీవన్‌రెడ్డి కొద్ది రోజులకే ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడిచారు. నాడు నాదేండ్ల వర్గంలో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. 1985 ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్నారు. తర్వాత దిక్కులేక కాంగ్రెస్‌లో చేరారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయనను నెత్తిన పెట్టుకుంటూనే వస్తోంది. ఆనాడు రెండే పార్టీలు. కాంగ్రెస్‌ను కాదని తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేలేకు వున్నారేగాని, మరో పార్టీ వుంటే ఏనాడో ఆయన పార్టీమారేవారేమో! ప్రతిపక్షంలో వున్నా, పాలకపక్షంలో వున్నా ఆయనకు పదవి మాత్రం కావాలి. నలభై ఏళ్లుగా ఆయన జగిత్యాలను తన అడ్డాగా చేసుకొని, ఇతర నాయకులకు ఎదకుండా చేసుకున్నారు. వ్యతిరేకంగా ఎవరూ ఎదగకుండా చేశారు. తన చెప్ప్పుచేతుల్లో వున్న నాయకులకు చిన్న చిన్న పదువులు ఎర వేసి, వారికి తానే రక్ష అనేలా రాజకీయం చేశారు. జగిత్యాలలో గత ఎన్నికల్లో జీవన్‌రెడ్డికి పోటీగా ఎవరూ కాంగ్రెస్‌లో ధరఖాస్తు చేసుకోలేదంటే పార్టీని ఆయన ఎంత బలహీనంగా మార్చారో అర్దం చేసుకోవచ్చు. నల్లగొండ జిల్లాలోనే బలమైన నాయకులైన కోమటిరెడ్డి కుటుంబాలకు వ్యతిరేకంగా కూడా నాయకులు తమకు అవకాశం కల్పించాలని పార్టీకి ధరఖాస్తులు చేసుకున్నారు. కాని జీవన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎవరూ ధరఖాస్తు చేసుకోలేదు. అంతగా పార్టీని తన చెప్ప్పుచేతుల్లో పెట్టుకొని కూడా ఈ మధ్య గాయ్‌గాయ్ చేయడం మొదలు పెట్టారు. తన సీటునే తాను గెల్చుకోలేకపోయిన జీవన్‌రెడ్డి పార్టీకి నేనే దిక్కు అనేంత స్ధాయి మాటలు మాట్లాడడం విడ్డూరం. కేవలం తన కూతురు రాజకీయం కోసం పార్టీని కబ్జా చేసినంతగా మాట్లాడడం కూడా సరైంది కాదు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో కి రావడం ఆయన సుతారం ఇష్టం లేదు. రెండుసార్లు వరుసగా సంజయ్ చేతిలో ఓడిపోయిన జీవన్‌రెడ్డి స్వచ్చందంగా తప్ప్పుకోవాల్సిన వయసు. కాని ఇంకా నేనే వుంటాను. నేనే మోనార్క్‌ని అన్నట్లు మాట్లాడి, ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తుంటే ఏ పార్టీ అయినా ఎందుకు ఊరుకుంటుంది. పైగా సిఎం. రేవంత్‌రెడ్డి ఎంత కష్టపడితే పార్టీ అదికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు. జీవన్‌రెడ్డికి కూడా తెలుసు. తెలంగాణ ఇచ్చినా పదేళ్లపాటు అదికారంలోకి రాకుండా నానాటికీ తీసికట్టులా మారుతున్న పార్టీని గట్టెక్కించిన నాయకుడు సిఎం. రేవంత్‌రెడ్డి. తన సర్వశక్తులు ఒడ్డి, పార్టీని బలోపేతం చేసి, అప్పటి పాలకులను ఎదిరించి అనేక పోరాటాలు చేశారు. జైలు జీవితం అనుభవించారు. మూడేళ్లపాటు సిఎం. రేవంత్‌రెడ్డి పడని కష్టం లేదు. పడని ఇబ్బంది లేదు. పార్టీ బలోపేతానికి కాలుకు బలపం కట్టుకొని తి రిగినట్టు తిరిగారు. ప్రజల్లో నమ్మకం కలిగించారు. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తీసుకొచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీకి కతజ్ఞత చూపించే బాధ్యత మన తెలంగాణది అని సెంటిమెంటు రగిలించారు. ఇలా అన్ని అనువైన అవకాశాలను అందిపుచ్చుకొని జనం మెప్ప్పు సాధించి కాంగ్రెస్‌పార్టీని అదికారంలోకి తెచ్చారు. ప్రజా వ్యతిరేకత లేకుండా, రాకుండా చూసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అలాంటి పాలనపై, సిఎం. రేవంత్‌రెడ్డిని నిత్యం విమర్శలకు గురిచేస్తూ వుండడం జీవన్‌రెడ్డి చేసిన అతి పెద్ద తప్ప్పు. పార్టీని గట్టెక్కించలేని నాయకత్వం జీవన్‌రెడ్డిది. తనకు తాను కూడా గెలవలేని పరిస్దితి వుంది. అయినా నలభై ఏళ్లపాటు సుథీర్ఘ క్రియాశీల రాజకీయాలు చేసినా ఇంకా ఆయనకు రాజకీయం మోజు తగ్గలేదు. పదవుల మీద ఆశ చావలేదు. అలాంటి వారిని ప్రజలు , పార్టీ ఎంత కాలం భరిస్తుంది. పొగ పె ట్టుకున్నాడో, పెగ పెడుతున్నారని అనుకున్నాడో మొత్తానికి జీవన్‌రెడ్డి జారుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి తగ్గించారు.
