భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఉమర్ తల్లిగారు స్వర్గస్తులైనారు వారి అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మామిడి రాజేశ్వరరావు,రాజు యాదవ్,కాదశి కుమార్,సైమన్,బుచ్చయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రవి రాంబాబు,22వ వార్డు కౌన్సిలర్ మసూద్,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్ ,ప్రభాకర్,రవి గౌడ్,కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.