
Senior Congress Leader Tirukolluru Ramayya Passes Away
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీరుకోళ్లూరి రామయ్య మృతి
నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
గుండాల(భద్రాద్రికొత్త
గూడెం జిల్లా),నేటిధాత్రి:
మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుకొళ్ళూరి రామయ్య అనారోగ్య కారణంతో మరణించిన విషయం తెలుసుకుని వారి మృత దేహానికి కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన గుండాల మండల పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్ ఈ సందర్బంగా ఖదీర్ మాట్లాడుతు రామయ్య ని అందరూ తమ ఇంటి పేరుతో కాకుండా పట్వారి రామయ్య అని సంభోదించే వారు ఈ ప్రాంతానికి వారు ఎంత సేవ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిని కోల్పోవడం చాలా బాధాకరం అని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి మరణం పార్టీకి గాని ప్రజలకు గాని తీరని లోటుగా భావించారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య , మండల ఏఏంసి డైరెక్టర్ ఊకే బుచ్చయ్య , సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య,ఎస్కె అబ్దుల్ నభి, పాయం గణేష్ , నునావత్ రవి,యువజన నాయకులు ఈసం భద్రయ్య,పల్లపు రాజేష్,బొంగు చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ మండల ఉప అధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.