
Senior citizen
ఆర్డీవోని కోరిన సీనియర్ సిటిజన్ సమస్యలను పరిష్కరించాలని విన్నపం
సిరిసిల్ల టౌన్: మే 21 (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్ ప్రతినిధులు రాష్ట్ర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సీనియర్ సిటిజన్ వృద్ధులను తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం నుండి గాని,సేవా సంస్థల నుండి గాని,ప్రభుత్వ పెన్షన్ విధానాలు గాని,జిల్లాలో ఉన్న వృద్ధులకు సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగినది. ఏదైనా వృద్ధులకు ఇబ్బంది ఉంటే సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో ని కోరడం జరిగింది , ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, కోశాధికారి దొంత దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.