
ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్న సీనియర్ అసిస్టెంట్ స్వాతి
నేటిధాత్రి, హనుమకొండ
హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న చింతం స్వాతి, కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగంలో ఉత్తమ ఉద్యోగిణిగా సేవా ప్రశంసా పత్రం అందుకున్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, రెవెన్యూ శాఖలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సిఎచ్ స్వాతి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చేతుల మీదుగా ప్రభుత్వ ఉత్తమ సేవా ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రశంసా పత్రం అందుకున్న స్వాతిని రెవెన్యూ అధికారులు, హనుమకొండ కలెక్టరేట్ సిబ్బంది, స్నేహితులు, బంధువులు అభినందనలు తెలిపారు