1) కల్తీ వీరమల్లు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్
2) మనోజ్ మడకం మాజీ ఎమ్మెల్యే ఒడిశా.
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం ఆదివాసి గిరిజన అభ్యుదయ భవనంలో రెండు రోజులు పాటు జరిగిన ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం యాభైవ ఆవిర్భావ దినోత్సవం లో ముఖ్య అతిథులుగా రెండవ రోజు పాల్గొన్న కల్తీ వీరమల్లు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశమునకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరములు పూర్తి అయినది అదే విధంగా భారత రాజ్యాంగం 1950లో ఆమోదించబడి సుమారు 74 సంవత్సరాలు పూర్తయిన ఎన్నో రాజ్యాంగ స రక్షణ చట్టాలు ఆదివాసి రక్షణకు అభివృద్ధికి వచ్చిన జీవన విధానంలో ఎటువంటి మార్పు రాకపోగా ఉన్న చట్టాలు అమలు కావడం లేదు ఉన్న వాటిని రద్దు చేస్తున్నారని ఆదివాసులను ఇంకా ఆదిమ స్థితికి దిగ జారుస్తున్నారని రాజకీయ ఆర్థిక సాంఘిక సామాజిక రంగాలలో అణగదొక్కుతున్నారని అన్నారు
మనోజ్ మడకం నాజీ ఎమ్మెల్యే మల్కన్గిరి ఒడిశా మాట్లాడుతూ ఆదివాసి మేధా విద్యావంతులు అయిన శ్రీ సందా లింగయ్య దొరగారు రాజ్యాంగ స్ఫూర్తిని అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి పథకములకు ఆకర్షితులై పందుల 74 సంవత్సరం నుండి ఆదివాసి విద్యార్థి సమస్యలపై ఆదివాసి యువజన సమస్యలపై ఆదివాసి గిరిజన జటల సమస్యల పరిష్కార కర్తగా 1974 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని తెరిచి గిరిజన విద్యార్థి మరియు యువజన అభ్యుదయ సంఘమును స్థాపించి తదుపరి అట్టి సంఘమును రిజిస్ట్రేషన్ నెంబర్ 968/74 యువ జన అభ్యుదయసంఘముగా నమోదు చేయించి ఆదివాసి గిరిజన జాతికి అభివృధానికి అభివృద్ధికి సుమారు 50 సంవత్సరాలుగా అనేక జటిల సమస్యలపై ఉద్యమాలను అలుపెరుగని పోరాటం పోరాట యోధులుగా అని గుర్తు చేశారు ఈ యొక్క కార్యక్రమంలో తాటి వెంకటేశ్వర్లు పబ్లిక్ ప్లాసిక్యూటర్ రిటైర్డ్ చౌదరి లక్ష్మీనారాయణ శ్రీకాకుళం జిల్లా కూరం సత్యనారాయణ ఆదివాసి జేఏసీ వెస్ట్ గోదావరి కురుషం సుబ్బారావు నేషనల్ ట్రైబల్ లీడర్ శ్రీమతి బి ఝాన్సీ రాణి నేషనల్ ట్రైబల్ లీడర్ పున్నం రామకృష్ణ నాయకపాడు సేవా సమితి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ ఉషా కిరణ్ నేషనల్ ట్రైబల్ ఫోరం. మడివి నరసింహారావు రాంజీ గోండు సేవా సమితి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ అదిలాబాద్ పాయం సత్యనారాయణ G SP రాష్ట్ర అధ్యక్షులు కీసర బజార్ ఆదివాసి పొలిటిల్ జెఏసీ వాసం రామకృష్ణ దొర ఈర్ప ప్రకాష్ ఆలంకోటి కుంజ వెంకటరమణ మడవి గౌతమి తదితరులు పాల్గొన్నారు