
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ లో బాలల దినోత్సవం సందర్భంగా సెల్ఫ్ గవర్నమెంట్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించడం జరిగింది. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలుగా స్నేహిత, వ్యాయామ ఉపాధ్యాయురాలుగా విజయలక్ష్మి, ఉపాధ్యాయులుగా వినయ్, కార్తీక్, అజయ్, చరణ్, రాకేష్, ప్రమోద్, కీర్తన, గంగోత్రి, భవాని, గౌతమి, అవనిక, ఆశ్రిత, తదితరులు వ్యవహరించారు. ఈకార్యక్రమంలో ఎంఈఓ అంబటి వేణు కుమార్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు శైలజ, చంద్రశేఖర్, శ్రీదేవి, జ్యోతి గంగ దేవేందర్ రెడ్డి, జలపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.