జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ లో మంగళవారం రోజున విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
ను జరుపుకున్నారు.
విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మంచి వేషధారణతో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులను మరిపించే విధంగా బోధన చేశారు వీరి తీరును చూసి ఎంఈఓ కోడపాక రఘుపతి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులుగా పుల్ల హర్షవర్ధన్ ఎంఈఓ గా వెళ్దండి సహస్ర, డిఈఓ గా మొగుళ్ళ సాయి చరణ్,లు వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి జడ్జిలుగా తుపాకుల వందన,గడ్డం శంకర్,కుచనపల్లి శ్రీనివాసులు వ్యవహరించారు.
అనంతరం వారి అనుభవాలను పంచుకున్నారు. పవిత్రమైన బోధనా వృత్తి తమకంతో ఆనందం కలిగించిందని, అందులోని కష్టసుఖాలను ఈ కార్యక్రమంలో ద్వారా తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోడపాక రఘుపతి ఎంఈఓ , ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి గారు ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, సరళాదేవి,నీలిమారెడ్డి, విజయలక్ష్మి, ఉస్మాన్ అలీ, బుర్ర సదయ్య,సుజాత,బుజ్జమ్మ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు