
నర్సంపేట టౌన్ , నేటిధాత్రి :
బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన అక్షర ద స్కూల్ , బిట్స్ స్కూల్ లో చాచా నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవం
నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో తరగతి
గదిలో పాఠాలు బోధించిన తీరు పలువురిని ఆకట్టుకున్నాయి.
అనంతరం బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన
రోజు నవంబర్ 14 ను బాలల దినోత్సవంగా దేశమంతా జరుపుకోవడం జరుగుతుందని
అన్నారు. నెహ్రూకు పిల్లలంటే ఎక్కువ ఇష్టమని తెలిపారు. రేపటి దేశ పురోగతికి నేటి బాలలే పాటు
పడతారని ఆయన బలంగా నమ్మేవారని అన్నారు. పిల్లలు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా
వ్యవహరించిన తీరు అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి కార్యకమ్రం నిర్వహించడం
ద్వారా విద్యార్థులలో దాగియున్న ప్రతిభ వెలుగులోనికి వస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు
బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.జ్యోతి గౌడ్, సీ.ఎ.వొ సురేష్ ,
ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.