*అర్హత లేని సంస్థలకు సెల్ప్ డిఫెన్స్ ప్రోగ్రాం కేటాయింపులు..
*నిబంధనలకు విరుద్ధంగా రూపేస్ ఏజెన్సీకి ప్రభుత్వం పాఠశాలల ట్రైనింగ్ ప్రోగ్రామ్..
*వెంటనే సంస్థను రూపేస్ ఏజెన్సీ ని బ్లాక్ లిస్టులో పెట్టాలని
ఓబిసి విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట్ యాదవ్ డిమాండ్.
చిత్తూరు(నేటి ధాత్రి) మార్చి 16:
జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినీలకు స్వీయ రక్షణ (సెల్ఫ్ డిపెన్స్) కార్యక్రమానికి సంబంధించి నిబంధనలు పాటించకుండా రూపేస్ ఏజెన్సీకి శిక్షణ ఇచ్చే వర్క్ ఆర్డర్లను జిల్లా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపిసీవో) లు అప్పగించారని, వీటిని వెంటనే రద్దు చేయాలని ఓ బిసి విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట్ యాదవ్ కోరారు.ఈ మేరకు ఆయన శుక్రవారం ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం స్థానిక కార్యాలయంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. మ్యాన్ పవర్ ఏజెన్సీ అయిన రూపేస్ ఏజెన్సీకి స్వీయ శిక్షణా కార్యక్రమంలో ఎలాంటి అర్హత లేదని ఆ సంస్థ ఎండికి ఎటువంటి నైపుణ్యం లేదని ఆయన తెలిపారు. సమగ్రా శిక్ష ఎస్పిడి ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అనుసరించలేదనినంద్యాల జిల్లాలో అయితే రూపేస్ ఎజెన్సీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అర్హత లేకపోవడంతో ఆ సంస్థకు శిక్షణా కార్యక్రమం వర్క్ ఆర్డర్ ఇవ్వలేదన్నారు. నంద్యాల జిల్లాలో అర్హత సాధించలేని రూపేస్ సంస్థ చిత్తూరు జిల్లాలో అర్హత సాధించిందో చెప్పాలన్నారు. వెంటనే సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణాకార్యక్రమంపై విచారణ చేసి అర్హతగల సంస్థలను ఎంపిక చేసేలా విద్యాశాఖ మంత్రి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.