జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గల జామా మస్జిద్ నూతన కార్యవర్గం కోసం మంగళవారం రోజున ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికలలో 89 ఓట్లతో నూతన
ప్రెసిడెంట్ గా మొహమ్మద్ యూసుఫ్ ఎన్నికయ్యారు. 94 ఓట్లతో వైస్ ప్రెసిడెంట్ గా సయ్యద్ అన్వర్ అలీ ఎన్నికయ్యారు. 83 ఓట్లతో జనరల్ సెక్రటరీగా మొహమ్మద్ జహీరొద్దీన్ ఎన్నికయ్యారు. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులను గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఎన్నికలను పకడ్బందీగా జరిపిన ఎలక్షన్ కమిటీ సభ్యులు మొహమ్మద్ ఫయాజుద్దీన్ (ఎక్స్ కోఅప్షన్ మెంబర్) ,మొహమ్మద్ బషీరొద్దీన్ (కారోబార్) , సయ్యద్ తయ్యబ్ అలీ(ఎక్స్ కోఅప్షన్ మెంబర్) , సయ్యద్ రఫీఖ్ , మొహమ్మద్ జైను, సలహాదారు మొహమ్మద్ అష్వక్ హుస్సేన్ అలాగే డిసిపి,ఎసిపి,సిఐ,ఎస్సై, మరియు పోలీస్ సిబ్బందికి నూతనంగా ఎన్నుకోబడిన మస్జిద్ కమిటీ మరియు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.