మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా
జడ్చర్ల కేంద్రంలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎం.ఇ.సి.ఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రమ్యశ్రీ ఇటీవల కరీంనగర్ లో నిర్వహించిన జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ డిస్కస్ త్రోలో బంగారు పథకాన్ని అంతేకాకుండా షాట్ ఫుట్ లో రజిత పథకాన్ని సాధించింది. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన రమ్యశ్రీ ని అథ్లెటిక్ ఫౌండేషన్ ఆ ఇండియా వారు నిర్వహించే జాతీయ స్థాయి జూనియర్ అథ్లెటిక్ పోటీలలో డిస్కస్ త్రో మరియు షార్ట్ ఫుట్ లకు ఎంపిక చేయడం జరిగింది. ఈ జాతీయ స్థాయి జూనియర్ అథ్లెటిక్ పోటీలు వరంగల్ నందుఅక్టోబర్ 14 నుండి 17 వరకు నిర్వహించబడతాయి. ఎంపికైన రమ్యశ్రీ ని కళాశాల ప్రిన్సిపాల్ డా. అప్పియ చిన్నమ్మ, ఫిజికల్ డైరెక్టర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు మరియు కళాశాల అధ్యాపకులు అభినందించారు.