పెద్దకోడేపాకలో ఇష్టాను సారంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక
ఏకపక్ష నిర్ణయాలతో ఐదుగురు కమిటీ సభ్యుల హవా
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం పెద్దకోడే పాక గ్రామంలో ఇష్టానుసా రంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్ల జాబితా విషయంలో ఏకపక్ష నిర్ణయాలతో ఐదుగురు కమిటీ వెనుక రహస్యమేముంది. బహుజన స్టూడెంట్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఇల్లు ఇప్పించా లని ఎమ్మెల్యే ప్రధానంగా కార్యకర్తలకు చెబితే కార్యకర్తలు స్వార్థ స్వభావాల తో ఇల్లు లేని గ్రామ ప్రజలకు గుర్తించకుండా ఐదుగురు కమిటీ సభ్యులకు సంబంధిం చిన కుటుంబ సభ్యులకు మరియు వాళ్ళ పేర్లు పెట్టుకుని ఏకపక్ష తీర్మానం చేయడం ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా ఒకేచోట కూర్చుం డబెట్టి తీర్మానం చేసి పై అధికా రులకు పంపించడం జరిగింది. కావున తక్షణమే ఐదుగురు కమిటీ సభ్యులను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఇల్లు లేని నిరు పేదలను గుర్తించి ఇల్లు వచ్చే విధంగా చేయాలని ప్రధా నంగా ఎమ్మెల్యే,కలెక్టర్ ను కోరుతున్నాం.లేనిపక్షంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.