
SI Rajasekhar.
రాష్ట్రస్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్ పోటీలకు ఎంపిక
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి పట్టణ కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్” విద్యార్థుల ఎంపిక
పట్టణ సీఐ శశిధర్ రెడ్డి ఎస్ఐ రాజశేఖర్ చేతుల మీదుగా ఘన సన్మానం
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన కృష్ణవేణి టాలెంట్ పాఠశాల విద్యార్థులు పాల్గొని జిల్లా స్థాయి కి ఎంపికయ్యారు. ఈనెల 28 జూలై సోమవారం రోజున జిల్లాలోని లక్షక్ పేట్ పట్టణంలోని మాత్మ గాంధీ జ్యోతిబాపూలే పాఠశాల మైదాన ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా నుండి దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొనగా హోరవోరిగా సాగిన
ఈ పోటీలలో మందమర్రి పట్టణానికి చెందిన హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచారు. అండర్ -16 జావెల్లింగ్ త్రో.. లో దురిశెట్టి నిశాంత్ అదేవిధంగా ..అండర్ –
14 లో ..షహబాజ్ లు అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలను సాధించి జిల్లాకు అదేవిధంగా తమ పాఠశాలకు వన్నె తెచ్చారు. ఈ సందర్భం గా.. ఈ ఇరువురి విద్యార్థులను మందమరి పట్టణ సీఐ శశిధర్ రెడ్డి ,ఎస్సై రాజశేఖర్లు సన్మానించారు.
ఈ సందర్భంగా ..వారు మాట్లాడుతూ.. ఆటలలో ఎప్పుడూ. . ముందుండాలని ,ఆటలతో గొప్ప – గొప్ప ఉద్యోగాలు సాధించవచ్చని,ఆటలతో సంఘంలో విలువలు పెరుగుతాయని, ఆగస్టు మాసంలో హనుమకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి, పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి మందమర్రి పట్టణానికి గొప్ప పేరు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ..కోచ్ రాం వేణును అభినందించారు. ఈ విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ రాం వేణు ప్రధానోపాధ్యాయులు గుణవతి సీనియర్ ఉపాధ్యాయులు మోకనపల్లి బద్రి శ్రీజ షరీనా శివాని సదానంద కృష్ణ మోహన్ వెంకటస్వామి పలువురు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.