Student Selected for National Shooting Ball
జాతీయ స్థాయికి క్రీడా పోటీలకు ఎంపిక– పిడి గుండెల్లి రాజయ్య
మొగులపల్లి నేటి దాత్రి
ఇటీవల అనగా 30 డిసెంబర్ 2025 నుండి 1 జనవరి 2026 వరకు మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 44వ రాష్ట్రస్థాయి సీనియర్
షూటింగ్ బాల్ సెలక్షన్” కం” టోర్నమెంట్ క్రీడా పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరఫున జడ్పీహెచ్ఎస్ మొగుళ్ళపల్లి పాఠశాల నుండి నలుగురు క్రీడాకారులు పాల్గొనగా మునిగాల అర్జిత్ కుమార్ (10 వ) జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పిడి గుండెల్లి రాజయ్య తెలిపారు. ఈ క్రీడా పోటీలు 9 జనవరి 2026 నుండి11 జనవరి 2026 వరకు మహారాష్ట్రలోని సోలాపూర్ లో జరుగుతాయని, తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున అర్జిత్ కుమార్ ఆడతారని తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జిల్లా విద్య పర్యవేక్షణ అధికారి విజయ పాల్ రెడ్డి మరియు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి భాగ్యశ్రీ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అర్జిత్ కుమార్ ను అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేసి అభినందించారు
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయురాలు , శ్రీమతి భాగ్యశ్రీ , ఉపాధ్యాయులు
టి.వెంకన్న, వై. సురేందర్,
జి. అనిల్ కుమార్,ఏ.వి.ఎల్ కళ్యాణి, బి.కుమారస్వామి,
కె. ప్రవీణ్, ఎం. రాజు, డి.పద్మ,పి. లలిత, జి.విజయ భాస్కర్,శ్రీ కల,
ఆర్. చందర్, శ్రీనివాస్,అటెండర్ ఎండి మజార్,వేణు,పాల్గొన్నారు
