వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో హనుమాన్ టికెడిలో కొట్ర విజయ్ కుమార్ అక్రమంగా సారా తయారు చేసే వారికి బెల్లం అమ్ముతున్నారని ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి విలేకరులకు తెలిపారు కేతావత్ చిట్టమ్మ పాతలావత్ మన్నెమ్మ మెట్టుపల్లె తాండకు చెందిన వారిని విచారణ చేయగా కో ట్ర విజయ్ కుమార్ పేరు చెప్పారని సీఐ తెలిపారు ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారి విశ్వనాథం ఆధ్వర్యంలో 400 కేజీ లు బెల్లం కో ట్ర విజయ కుమార్ నుండి స్వాధీనం చేసుకున్నామని అదేవిధంగా అయిన కేసు నమోదు చేశామని తెలిపారు విజయ్ ని విచారించగా కంది కొండ సాయిరాం పిన్నం నరేందర్ ముగ్గురం కలిసి బెల్లం వ్యాపారం చేస్తున్నామని బెల్లం కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నామని విజయ్ చెప్పారని సీఐ తెలిపారు వనపర్తి లో కిరాణం వ్యాపారులు తెల్ల బెల్లం వినియోగదారులకు రెండు కేజీలు మాత్రమే ఇవ్వాలని కిరాణం వ్యాపారులు 10 కేజీల బెల్లం ఎవరికైనా ఇస్తే వారి ఆధార్ జిరాక్స్ తీసుకొని ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు సారాకు ఉపయోగపడే నల్ల బెల్లం పటికి నవ సాగరం ప్రభుత్వం నిషేధించిందని సీఐ తెలిపారు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత పటికి నవ సాగరం అమ్మితే పిడి యాక్ట్ కేసులు బైండోవర్ చేస్తామని సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు ఎవరైనా నల్ల బెల్లం పటికి నవ సాగరం అమ్మితే ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు మెట్టుపల్లి తండాకు చెందిన కేతావత్ చిట్టెమ్మ రెండు లీటర్ల సారా పతావత్ మణెమ్మ ద్వారా 30 లీటర్ల బెల్లం ఊట ఒక లీటర్ సారా స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు వీరిపై కేసు నమోదు చేశామని తెలిపారు జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ విశ్వనాథం ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి ఎస్సై లు రాజేందర్ సంధ్య పాల్గొన్నారు కిరాణ0 వ్యాపారులు సారా చేసేవారికి నల్ల బెల్లం నవ సాగరం పటికి అమ్మితే పిడి యాక్ట్ కేసు నమోదు చేసి ఒక సంవత్సరం జైలుకు పంపుతామని సీఐ తెలిపారు
వనపర్తి లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో బెల్లం స్వాధీనం
