అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

టేకుమట్ల ఎస్సై ప్రసాద్

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండలం వెలిశాల రామకృష్ణాపురం వి గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ మధుకర్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వీరికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు రామకృష్ణాపూర్ వి గ్రామపంచాయతీ వద్దకు రెండు ఇసుక ట్రాక్టర్లు ఇసుక లోడుతో వస్తుండగా అట్టి ట్రాక్టర్ డ్రైవర్ కం ఓనర్లను ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేయుటకు ఏమైనా ప్రభుత్వ అనుమతి పత్రాలు ఉన్నాయని అడగగా ఇసుక రవాణా చేయుటకు ఎలాంటి అనుమతి పత్రాలు లేవని తెలిపినారు పంచనామా నిర్వహించి సదరు వ్యక్తులైన నలివెల నాగరాజు R/O రామకృష్ణాపూర్ వి TS 03 EN 2571 ఇంకో ట్రాక్టర్ డ్రైవర్ అయిన చెక్క వెంకటేష్ R/o రామకృష్ణాపూర్ వి AP36AX5459 ఇట్టిరెండు ట్రాక్టర్ల ఓనర్ అయిన నలివెల నాగరాజు చెక్క వెంకటేష్ ను పిఎస్ కు తీసుకువచ్చి వారిపై కేసు నమోదు చేయనైనది ఇకమీదట ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేసినచో వారిపై తగిన చర్యలు తీసుకుంటూ పీడీ యాక్ట్ నమోదు చేయబడునని టేకుమట్ల ఎస్సై ప్రసాద్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *