జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట పట్టణం నుండి మాచనపల్లి గ్రామానికి వెళ్లే దారిలో జమ్మికుంట ఎక్సైజ్ సీఐ అక్బర్ హుస్సేన్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానస్పదంగా కనిపించిన మాచనపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి వెంకన్న తండ్రి నర్సయ్య స్టార్ సిటీ వాహనాన్ని తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 3.6 లీటర్ల మద్యం బాటిళ్లు, స్టార్ సిటీ వాహనం స్వాధీనం చేసుకొని కుమ్మరి వెంకన్న పై కేసు నమోదు చేయనైనదని జమ్మికుంట ఎక్సైజ్ సీఐ అక్బర్ హుస్సేన్ తెలిపారు. సీజ్ చేసిన మద్యం ద్విచక్రవాహనం విలువ రుపాయలు 28,960 గలదని. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైన అక్రమ మద్యం అమ్మినా, నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సిఐ అక్బర్ హుస్సేన్ హెచ్చరించారు. ఇట్టి దాడులలో ఎక్సైజ్ ఎస్సైలు రమాదేవి, కబీర్ దాస్, హెడ్ కానిస్టేబుల్ ఐలయ్య, కానిస్టేబుల్లు సిద్దన్న, మహేష్, పపద్మావతి, శైలజ పాల్గొన్నారు.