హన్మకొండ, నేటిధాత్రి:
బాక్సింగ్ సబ్ జూనియర్స్ విభాగంలో హైదరాబాద్ లాలాగూడ రైల్వే వర్క్ షాప్ గ్యారేజీలో ఫిబ్రవరి 21 22 23వ తేదీలో జరిగిన స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో శీలం తనుశ్రీ వెండి పథకం సాధించడం జరిగింది. అదేవిధంగా ఈనెల 18 నుండి 26 తేదీలో ఉత్తరప్రదేశ్ లోని నోయడ లో జరిగే జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలో పాల్గొనడం జరుగుతుందని కోచ్ శ్యాం సన్ మరియు జిల్లా బాక్సింగ్ సెక్రటరీ నరసింహ రాములు, పార్థసారథి తెలియజేస్తు జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలో తలబడనున్న తనుశ్రీకి అభినందనలు తెలిపారు.