మండల వ్యవసాయ అధికారి గంగా జమున
శాయంపేట నేటి ధాత్రి;
హనుమకొండ జిల్లాశాయంపేట మండలం కలెక్టర్ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారి,రెవెన్యూ, పోలీసు శాఖలు సంయుక్తంగా మండల టాస్క్ఫోర్స్ టీమ్ గా ఏర్పడి వివిధ గ్రామాలలోని విత్తన షాపులను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా యధావిధిగా స్టాక్ రిజిస్టర్లను, బిల్లు బుక్కులను, లైసెన్సులను, స్టాక్ బోర్డులను విత్తన ప్యాకెట్లపై ముద్రించిన సమాచారాన్ని పశీలించడం జరిగినది. రైతులతో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడం జరిగినది.పత్తి పంటలో మేలైన యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు సాధించవచ్చు పత్తిలో హైబ్రిడ్ విత్తన రకాలన్నీ ఒకే తరహా దిగుబడులను ఇస్తాయి.ఒకేరకమైన విత్తనాలకోసం పోటీ పడాల్సిన అవసరం లేదు.కొనే విత్తనాలకు సంబంధించి బిల్ లేదా రశీదు తప్పనిసరిగాతీసుకోవాలి.విత్తన లైసెన్స్ కలిగినటువంటి డీలర్ దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలి.పంట కాలం అయిపోయేవరకు రశీదు రైతు దగ్గరే భద్రపరుచు కోవాలి.రశీదుపై విత్తనం యొక్క అన్ని వివరాలు ఉండాలి.విత్తన ప్యాకెట్ మీద తయారైన తేదీ, కాలం ముగిసిన తేదీ ఉందో గమనించాలి.గ్రామాలలో లూస్ విత్తనాలు లేదా నకిలీ విత్తనాలు అమ్మినచో కొనకూడదు.వెంటనే వ్యవసాయ శాఖకు తెలియపరచాలి.విత్తన ప్యాకెట్ పై ఉన్న గరిష్ట ధరను మించి కొనరాదు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి , ఎమ్మారై శరత్ కుమార్ ఏఆర్ఐ ఎండి హుస్సేన్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ పాల్గొన్నారు.