రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కోరిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి..
మంగపేట నేటిధాత్రి
ఎంతో వ్యయ ప్రాయాసలకు ఓర్చి సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య మరియు సుగంధ పంట మిర్చి సాగు రైతులకు నష్టాలను మిగులుస్తోందని మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వివిధ పథకాల కింద నిధులు మంజూరు అయ్యేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కోరారు మంగళవారం ఆయన హైదరాబాదు రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు అనంతరం శాలువాతో సన్మానించి సుగంధ ద్రవ్యాల పుస్తకాన్ని సాంబశివరెడ్డి గవర్నర్ కి బహుకరించారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ అందజేసిన నివేదిక ఆధారంగా ఎమ్మెస్ స్వామినాథన్ కమిటీ సూచనలను సైతం పరిగణలోకి తీసుకొని నిధులు మంజూరు కి చొరవ తీసుకోవాలని గవర్నర్ కి సాంబశివరెడ్డి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలతో పాటు కులవృత్తులు గ్రామీణ లఘు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు స్ఫూర్తి పథకానికి కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసేలా చూడాలని గవర్నర్ ని కోరారు ఆత్మ నిర్భర్ భారత్ పథకం ద్వారా పల్లెల్లో కుటీర పరిశ్రమలను పెద్ద ఎత్తున నెలకొల్పాలని సాంబశివరెడ్డి విజ్ఞప్తి చేశారు అనంతరం వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై లేఖలను సాంబశివరెడ్డి గవర్నర్ కి అందజేశారు సమస్యలు విన్న గవర్నర్ వర్మ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కామర్స్ మరియు ఇండస్ట్రీ శాఖతో మాట్లాడి నిధులు సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ఆర్ డాక్టర్ గాది లింగప్ప ఇతర అధికారులు పాల్గొన్నారు.