-ఎస్పీ అఖిల్ మహాజన్
-జాతర సమయంలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా
ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు
-అన్ని శాఖ అధికారులను
-సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, పోలీస్ అధికారులతో మహాశివరాత్రి జాతర ప్రశాంత వాతావరణంలో, భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవలసిన విధి విధానాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మార్చి 7నుంచి మార్చి 9 వరకు 3 రోజుల పాటు మహా శివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న నేపద్యంలో వివిధ రాష్ట్రల నుండి,దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు భద్రత పరంగా ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
మహాశివరాత్రి జాతర సందర్భంగా 1400 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, జాతర ప్రాంగణ మొత్తం సీసీ కెమెరాలు ఆధీనంలో ఉండేలా చూడాలని,అన్ని శాఖల అధికారులు సిబ్బంది ,ఇతర జిల్లా నుండి వచ్చిన అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
ఈ సారి భక్తుల రద్దీ పెరిగే నేపథ్యంలో 8 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగిందని , జాతర వచ్చే వాహనాలు పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేసే విదంగా చర్యలు తీసుకువడం జరిగిందని దానికి అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ట్రాఫిక్ నిర్వహణ జాతర సమయంలో ప్రథమ స్థానంలో ఉంటుందని,గత అనుభవాలను దృష్టింలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా దానికి అనుగుణంగా సిబ్బందిని కేటాయించి పకడ్బందీ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రచారి, గంగాధర్, సి.ఐ లు ఆర్.ఐ లు,ఎస్.ఐ లు పాల్గొన్నారు.