జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
భూపాలపల్లి నేటిధాత్రి
మంగళవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 108 అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన సెక్టోరియల్ అధికారులతో తోరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.
ఏప్రిల్ నెలలో కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని కాబట్టి సెక్టోరియల్ అధికారులు వారి వారి రూట్ల ను పరిశీలించుకోవాలని
తెలిపారు.గత అసెంబ్లీ ఎన్నికలలో భూపాలపల్లి నియోజకవర్గంలో 29 సెక్టార్లలో 32 మంది సెక్టోరియల్ అధికారులు 317 పోలింగ్ కేంద్రాల ద్వారా పోలింగ్ నిర్వహించడం జరిగిందని అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెక్టోరియల్ అధికారులు విధులు నిర్వహించాలని తెలిపారు.
సెక్టోరియల్ అధికారులు వారి వారి సెక్టార్లలోని బి.ఎల్.ఓ లు, బి.ఎల్.ఓ సూపర్వైజర్లు , ఎమ్మార్వోలు, ఎంపీడీవోలను సమన్వయపరచుకుంటూ పార్లమెంటు ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరు, పారం 17 సి లను పరిశీలించాలని తెలిపారు. అధునాతన టెక్నాలజీ గల M3 ఈవీఎం మిషన్ల ద్వారా పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని.
ప్రతి పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి అవ్వడానికి సెక్టోరియల్ అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆర్.డి.ఓ.రమాదేవి, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు