చిట్యాల, నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున చిట్యాల 5 వ కేంద్రంలో డి.జ్యోతి అంగన్వాడి టీచర్ సమక్షంలో చిట్యాల సెక్టార్ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో జయప్రద సూపర్వైజర్ పాల్గొని మాట్లాడుతూ గర్భవతులు బాలింతలు ప్రతిరోజు కేంద్రానికి వచ్చి భోజనం చేయాలని మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ ఉదయం 9 గంటలకు కేంద్రానికి పంపించాలని ప్రతి నెల పిల్లల బరువులు తీయించుకోవాలని బాలామృతం తప్పనిసరి పిల్లలకు రోజుకు 100 గ్రాముల చొప్పున తినిపించాలని అప్పుడే పిల్లల ఎదుగుదల బాగుంటుందని, ఎండ తీవ్రత ప్రారంభమైనందున పిల్లలకు చల్లటి వాతావరణంలో ఉంచుతూ బయట తిను బండారాలు ఏవి పెట్టరాదని, చల్లటి పానీయాలు ముఖ్యంగా కూల్ డ్రింక్స్ తాగించవద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో గర్భవతులు బాలింతలకు 25 మంది అంగన్వాడి టీచర్స్ హాజరైనారు.