రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్
2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలులోకి రానుంది.పార్లమెంట్ ఎన్నికలు మే 13న ఉన్నందున పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పెద్దపల్లి పార్లమెంట్ పరిదిలోని 22-ధర్మపురి నియోజకవర్గం (పాక్షిక స్థాయిలోని), 23-రామగుండము, 25- పెద్దపల్లి నియోజకవర్గాలలో రేపు సాయంత్రం అనగా మే 11 శనివారం సాయంత్రం 6:00 గంటల నుండి మే 13 సోమవారం సాయంత్రం 6:00 గంటల వరకు మరియు అలాగే 24-మంథని నియోజకవర్గం, 03-చెన్నూరు, 02-బెల్లంపల్లి, 04-మంచిర్యాల నియోజకవర్గాలలో మే 11 శనివారం సాయంత్రం 4:00 గంటల నుండి మే13 సోమవారం సాయంత్రం 4:00 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.(ఐజి) ఉత్తర్వులు జారీ చేశారు.రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా తిరగొద్దని తెలిపారు.రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించొద్దని, ప్రదర్శించొద్దని తెలిపారు. మైకులు, లౌడ్ స్పీకర్లు వాడరాదని, రాజకీయ పార్టీలకు సంబందించిన పాటలు, ఉపన్యాసాలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం లాంటి కార్యక్రమాలను నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని మరియు ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఏం.శ్రీనివాస్ తెలిపారు.