ముత్తారం :- నేటి ధాత్రి
రైతులకు రుణమాఫీ రెండవ విడుతలో భాగంగా ముత్తారంలో 61 మంది రైతులకు , ఓడేఢ్ 58 మంది ,పారుపల్లి 72, శాత్రాజుపల్లి 38,అడవి శ్రీరాంపూర్ 125 ,ఇప్పలపల్లి 88, ఖమ్మం పల్లి 89 , దర్యాపూర్ 50 ,కేషన్ పెళ్లి 39 ,మచ్చుపేట 32, లక్కారం 53 మైదం బండ 62 ,పోతారం 14 సర్వారం 15 శుక్రవారం పేట 14 మొత్తం 810 మంది రైతులకు 8 కోట్ల 21 లక్షలు లబ్ధి చేకూరనుంది అని మండల వ్యవసాయాధికారి చిందం శ్రీకాంత్ తెలిపారు.రెండు విడుతలు కలిపి 2426 రైతు కుటుంబాలకు 17 కోట్ల 50 లక్షల రూపాయలు రుణమాఫీ కావడం జరిగిందని తెలిపారు.
కావున రుణమాఫీ లబ్దిదారులు వెంటనే బ్యాంక్ మేనేజర్ ను కలిసి,పంట రుణం రెన్యువల్ చేసుకొని రుణమాఫీ అమౌంట్ ను తీసుకోగలరని తెలిపారు