మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 17
మంగళవారం రోజు రాత్రి పరకాలలోని సాయిబాబా టెంపుల్ లో జరిగిన భజన పోటీలలో 32 భజన బృందాలు పాల్గొన్నాయి. కాగా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన శివ రామకృష్ణ భజన మండలి వారు ద్వితీయ బహుమతి 10016లు గెలుచుకోగా పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి వారిని శాలువాలతో ఘనంగా సత్కారించి, నగదుతో పాటు మెమొంటోను అందజేశారు. ఈ సందర్బంగా భజన పోటీలలో పాల్గొని ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్న శివరామకృష్ణ భజన మండలి సభ్యులను గ్రామ సర్పంచ్ మోటే ధర్మారావు, మరియు గ్రామస్థులు అభినందించారు.