Second phase of land pooling.. farmers agree
రెండో విడత ల్యాండ్ పూలింగ్.. రైతుల అంగీకారం
అమరావతి అభివృద్ధి, విస్తరణ కోసం భూములు ఇచ్చేందుకు వడ్డమాను రైతులు అంగీకారం తెలిపారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు గ్రామ రైతులు మద్దతుగా నిలిచారు.
రాజధాని అమరావతిలోని తుళ్ళూరు మండలంలో మంత్రి నారాయణ ఈరోజు (బుధవారం) పర్యటించారు. వడ్డమాను గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో రెండో విడత ల్యాండ్ పోలింగ్‌కు రైతులు అంగీకారం తెలిపారు. అయితే కౌలు ప్యాకేజీ పెంచాలని మంత్రికి రైతులు వినతి చేశారు. గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు తమ పాసుపుస్తకాలను మంత్రి నారాయణకు అందజేశారు.
