Scrub Typhus Scare in Palnadu
పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం.. ఇద్దరు మృతి
పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం సృష్టిస్తుం ది.ఈ లక్షణాలతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అలానే మరొకరు చికిత్స పొందుతున్నారు. ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి , రాజుపాలెంకు చెందిన సాలమ్మ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందారు.
పల్నాడు జిల్లా, డిసెంబర్02: జిల్లాలో స్క్రబ్ టైఫస్(Palnadu scrub typhus) కలకలం సృష్టిస్తుంది. ఈ లక్షణాలతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అలానే మరొకరు చికిత్స పొందుతున్నారు. ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి జ్వరం, ఒంటినొప్పులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మరణించింది. రాజుపాలెంకు చెందిన వృద్ధురాలు నాగమ్మ కూడా జ్వరంతో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మృతి చెందింది. అలానే రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన మరో వృద్ధురాలు సాలమ్మ కూడా స్క్రబ్ టైఫస్(scrub typhus) లక్షణాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చనిపోయిన జ్యోతి, నాగమ్మల శాంపిల్స్ ను టెస్టుల కోసం ముంబై పంపించారు. పరీక్షల్లో స్క్రబ్ టైఫస్‌తో మృతిచెందినట్లు రిపోర్టుల్లో తేలినట్లు ప్రచారం జరుగుతుంది. దీని గురించి స్పష్టత రావాల్సి ఉంది.
స్క్రబ్ టైఫస్(Scrub Typhus) వ్యాధి గురించి వైద్యులు పలు వివరాలు తెలిపారు. నల్లిని పోలిన చిన్న కీటకం స్క్రబ్ టైఫస్. గత కొన్నేళ్లుగా జిల్లాలో తన ఉనికిని చాటుకుంటూనే ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీని బారినపడి ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ కాటుతో సోకే బ్యాక్టీరియా ప్రభావాన్ని గుర్తించేందుకు గుంటూరు సమగ్రాసుపత్రిలో ప్రయోగశాల ఉందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి తెలిపారు. అనుమానిత లక్షణాలున్న వారి రక్త నమునాలు పంపితే నిర్ధారణ పరీక్షలు చేస్తామని వైద్యులు తెలిపారు. పాజిటివ్‌గా గుర్తిస్తే చికిత్స అందిస్తారని వైద్యాధికారి డాక్టర్ రవి తెలిపారు. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదని వివరించారు. తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
