బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపురం గ్రామంలో జిల్లా ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, బోయినపల్లి వారి సహకారంతో ఈ రోజు మండలం లోని మల్కపుర్ గ్రామంలో వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం వరి పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో మొగి పురుగు, సల్ఫైడ్ దుష్ప్రవాన్ని గుర్తించి రైతులకు తగు సూచనలు చేశారు. ఈ క్షేత్ర సందర్శనలో శాస్త్రవేత్తల బృందం, మోగి పురుగు లక్షణాలు, నివారణ చర్యలు తెలియజేయడం జరిగింది. నారుమడి దశ లో మరియు పిలక దశ లో ఆశిస్తే మొక్కలు
ఎండి చనిపోతావి. ఆలస్యంగా ముదురు నారు నాటడం, కరువు పరిస్థితులు, తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు వుండి, సూర్యరశ్మి రోజుకు 7 గంటల కంటే ఎక్కువ వుంటే ఈ పురుగు రావడానికి అనుకూలం. తల్లి పురుగు ముదురు గోధుమ, ఎండుగడ్డి, పసుపు రంగులో ఉన్న ఆడ పురుగుల ముందు జత రెక్కల పై నల్లటి మచ్చ కలిగి వుంటాయి. తెలుపు గోధుమ రంగు లో వుండే పిల్ల పురుగులు (లార్వా) ఎదిగిన తరువాత నారింజ పసుపు రంగు తల కలిగి వుంటుంది. నారు పీకే 7 రోజుల ముందు 2 గుంటల నారు మడికి 800 గ్రాముల కార్బోప్యురాన్ 3జి గులికలను చల్లి నీటిని ఆ మడిలో నే ఇంకెట్లు చేయాలి. అలాగే నాట్లు వేసిన 10 నుండి 15 రోజులలో కార్బోప్యురాన్ 3 జి గుళికలను ఏకరానికి 10 కిలోల చొప్పున లేదా కార్టప్ హైడ్రో క్లోరైడ్ 4జి గుళికలు ఎకరానికి 8 కిలోలు లేదా క్లోరాoత్రనిలిప్రోల్ 0.4 జి గుళికలు 4 కిలోలు చల్లుకోవాలి. ఎక్కువగా ఉన్నప్పుడు కార్టప్ హైడ్రో క్లోరైడ్ 50 ఎస్.పి. 400 గ్రా/ ఎకరాకు లేదా క్లోరనింత్రినీలిప్రోలు 60మి. లి ఎకరాకు పిచికారి చేసుకోవాలి. అలాగే సల్ఫైడ్ దుష్ప్రభావం నివారణకు కాంప్లెక్స్ ఎరువులను పైపాటిగా చల్లకుండా చూసుకోవాలి. మురికి నీరుని తీసేసి సన్నటి పగుళ్లు వచ్చేవరకు వరి పొలాన్ని ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని నియంత్రించుకోవచ్చు. అలాగే పైరుకు పోషకాల మిశ్రమాన్ని పై పాటుగా పిచికారి చేసుకోవాలి. ఈ క్షేత్ర ప్రదర్శనలో భాగంగా జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ శాస్త్రవేత్తల డా. ఎ.విజయ్ భాస్కర్, డా. జి. ఉషా రాణి, డా. పి. మధుకర్ రావు, మరియు
మండల వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీదేవి, మరియు రైతులు పాల్గొన్నారు.