
నేరాల విచారణలో ఆధారమయ్యే శాస్త్రీయ పరిజ్ఞానం ఎంతో అవసరం
ఆధునిక ఫోరెన్సిక్ పద్దుతులు వినియోగించడం ద్వారా నేరాలను సమర్ధవంతంగా పరిష్కరించవచ్చు
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐ.పీ.ఎస్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేరాల విచారణలో శాస్త్రీయ ఆధారాలు,ఆధునిక ఫోరెన్సిక్ పద్ధతుల వినియోగం కీలకమని జిల్లా ఎస్పీ తెలిపారు.నేర సంఘటన స్థలంలో ఆధారాల సేకరణ,భద్రత లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా కేసుల దర్యాప్తులో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. నేర పరిశోధనలో ఆధునిక
సాంకేతికత ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో,కేసుల విచారణలో ఆధారాలను సైన్స్ పరంగా విశ్లేషించడానికి ఫోరెన్సిక్ శిక్షణ ఎంతో అవసరమని అందులో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో మెడికల్ కళశాల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో జిల్లాలోని ఇన్వెస్టిగేషన్ అధికారులకు,స్టేషన్ రైటర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఆధునిక శాస్త్రీయ విధానాల ద్వారా నేరాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ మరింత ప్రావీణ్యంతో ముందుకు సాగుతోందని,నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికత ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో,కేసుల విచారణలో ఆధారాలను సైన్స్ పరంగా విశ్లేషించడానికి ఫోరెన్సిక్ శిక్షణ ఎంతో అవసరమన్నారు.ఇలాంటి శిక్షణల ద్వారా కేసుల విచారణలో మరింత నిష్ణాతులుగా తయారయ్యేలా పోలీస్ అధికారులకు,సిబ్బందికి దోహదపడతాయన్నారు.హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు మొదలగు నేర సంఘటనలో ఆధారాలు ఏ విధంగా సేకరించాలి, ఏ ఏ ఆధారాలు సేకరించాలి,ఏ విధంగా భద్రపరచాలి,ఫోరెన్సిక్ ల్యాబరేటరికి ఎం ఎం పంపించాలనె అంశాలపై ఇన్వెస్టిగేషన్ అధికారులకు,స్టేషన్ రైటర్లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
జిల్లా పోలీస్ అధికారులకు,సిబ్బందికి
ఫోరెన్సిక్ సైన్స్ పై అవగాహన కల్పించిన మెడికల్ కళశాల వైద్య బృందాన్ని అభినందించి మెమోంటోస్ అందించిన జిల్లా ఎస్పీ. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజేశ్వరి, వైస్ ప్రెసిపల్ డా. లక్ష్మీ నారాయణ,డా. నిర్విష హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ మెడిసిన్, డా. వినేయ్ మరియు కళాశాల ప్రొఫెసర్లు,
డాక్టర్లు,సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్.ఐ లు యాదగిరి, మధుకర్, ఎస్.ఐ లు అన్ని పోలీస్ స్టేషన్ల రైటర్స్ పాల్గొన్నారు.